బస్సు త్వరగా ఎక్కమన్నందకు కండక్టర్‌పై మహిళల దాడి... | - | Sakshi
Sakshi News home page

బస్సు త్వరగా ఎక్కమన్నందకు కండక్టర్‌పై మహిళల దాడి...

Jun 25 2023 7:22 AM | Updated on Jun 25 2023 7:45 AM

కండక్టర్‌తో వాదులాడుతున్న మహిళలు  - Sakshi

కండక్టర్‌తో వాదులాడుతున్న మహిళలు

బస్టాప్‌ వద్ద వే చి ఉన్న ఇద్దరు మహిళలను బస్సు కండక్టర్‌ త్వరగా బస్సు ఎక్కాలని తొందర పెట్టాడు.

కర్ణాటక: బస్సులో త్వరగా ఎక్కమన్నందకు కోపగించుకున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు కండక్టర్‌పై దాడికి దిగిన ఘటన బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ గుడ్డలో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సవదత్తి యల్లమ్మ గుడ్డ బస్టాప్‌ వద్ద వే చి ఉన్న ఇద్దరు మహిళలను బస్సు కండక్టర్‌ త్వరగా బస్సు ఎక్కాలని తొందర పెట్టాడు. ఈ క్రమంలో కండక్టర్‌కు, మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది.

మాటమాట పెరిగి మహిళలు ఇద్దరు కండక్టర్‌పై చేయి చేసుకున్నారు. ఆయన బట్టలు చించివేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బస్సు త్వరగా ఎక్కాలని కోరినందుకు మహిళలు ఇద్దరు తనపై దాడి చేశారని కండక్టర్‌ భద్రణ్ణవర తెలిపారు. వారి జతలో ఉన్న ఓ పురుషుడు కూడా తనను దుర్బాషలాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

కుందగోళ–హుబ్లీ మార్గంలో మరో ఘటన ఓ వృద్ధురాలిని మహిళా కండక్టర్‌ చెంపపై కొట్టిన ఘటన కుందగోళ–హుబ్లీ మార్గంలో జరిగింది. కుందుగోళ నుంచి హుబ్లీకి వెళ్తున్న బస్సులో శుక్రవారం ఉదయం శెరెవాడ గ్రామం వద్ద టికెట్‌ విషయంపై గొడవ జరిగింది. మహిళా కండక్టర్‌ వృద్ధురాలి చెంపపై కొట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement