కోలారు: తాలూకాలోని వక్కలేరి ఫిర్కా చుంచదేనహళ్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయంపై నూతనంగా నిర్మించిన విమాన గోపురాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేవాలయాలను సందర్శిస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలను జీర్ణోద్ధారణ చేసి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కోముల్ డైరెక్టర్ చంచి మలై రమేష్, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఖాజి కల్లహళ్లి మునిరాజు, జిల్లా గ్యారెంటీ సమితి అధ్యక్షుడు వై.శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


