ఆరు రోజుల్లో 11 టీఎంసీలే ! | - | Sakshi
Sakshi News home page

ఆరు రోజుల్లో 11 టీఎంసీలే !

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

తుంగభద్ర డ్యాంలో

నీటి చేరిక అంతంత మాత్రమే

రైతన్నల్లో ఆందోళన

నారాయణపుర గేట్ల నుంచి నీరు విడుదల

తుంగభద్ర డ్యాంలోకి చేరిన నీరు

హొసపేటె: మలెనాడులో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేవలం ఆరు రోజుల్లో తుంగభద్ర జలాశయంలోకి 11 టీఎంసీల నీరు చేరింది. ఈ సారి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో జలాశయంలోకి నీటి ప్రవాహం ఆశించన స్థాయిలో చేరలేదని చెప్పుకోవచ్చు. జూలై ఆరంభంలో తుంగభద్ర నదికి మూలమైన తుంగ, భద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జలాశయంలోకి నీటి ప్రవాహం పెరిగింది. అయితే ఈ నీటిమట్టం ఏమాత్రం చాలదని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక డ్యాంలో జల విద్యుత్‌ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో జలాశయంలోకి 11.447 టీఎంసీల నీరు చేరగా.. వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ జలాలు చాలవని రైతులు చెబుతున్నారు.

తగ్గిన వరద ప్రవాహం

రాయచూరు రూరల్‌: ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో కృష్ణా నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. బెళగావి, విజయపుర, బాగల్‌కోట, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. ఆదివారం నారాయణ పుర డ్యాం నుంచి 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దేవదుర్గ తాలూకా హువిన హడగలి వంతెనపై నీటి ఉధృతి తగ్గింది. వంతనపై స్వల్పంగా వరద నీరు ప్రవహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement