ఫోన్‌ చేస్తే బిజీ వస్తోంది.. నీకు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం వుంది.. | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేస్తే బిజీ వస్తోంది.. నీకు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం వుంది..

Jun 22 2023 7:12 AM | Updated on Jun 22 2023 7:38 AM

హత్యకు గురైన కవిత, నిందితుడు సలీం మున్నా ఖాన్‌(ఫైల్‌)  - Sakshi

హత్యకు గురైన కవిత, నిందితుడు సలీం మున్నా ఖాన్‌(ఫైల్‌)

యశవంతపుర: వివాహిత అనుమానాస్పద మృతికేసు మిస్టరీ వీడింది. ఆమెను తానే హత్య చేసినట్లు ప్రియుడు మద్యం మత్తులో నిజాన్ని కక్కేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. హరపనహళ్లి తాలూకా నిట్టూరుకు చెందిన వ్యక్తితో దావణగెరె తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన కవితకు వివాహమైంది. హరహరకు వెళ్లివస్తానంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఇంటినుంచి వెళ్లిన కవిత తిరిగి రాలేదు.పుట్టింటివారిని విచారించగా రాలేదని చెప్పారు. దీంతో హలవాగలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఒక పొలంలో మృతదేహం కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.

ప్రియుని సొంతూరుకు వెళ్లి..
ఇంటినుంచి వెళ్లిన కవిత తన ప్రియుడు సలీం మున్నాఖాన్‌తో కలిసి అతని సొంతూరు తెలగికి వెళ్లింది. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి బైకులో కుంచూరి చెరువు వద్దకు వెళ్లారు. ఫోన్‌ చేస్తే బిజీ వస్తోంది.. నీవు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం పెట్టుకున్నవంటూ సలీం కవితను నిందించాడు. ఓ దశలో గొంతు పిసికి ఆమెను హత్య చేశాడు. అనంతరం పొలంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఇటీవల తాగిన మత్తులో ఉన్న సలీం.. కవితను తానే చంపానని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడున్నవారు కవిత కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సలీంను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement