నాగేంద్రకు మంత్రి పదవి? | - | Sakshi
Sakshi News home page

నాగేంద్రకు మంత్రి పదవి?

May 19 2023 7:32 AM | Updated on May 19 2023 7:41 AM

- - Sakshi

బళ్లారి అర్బన్‌: కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారీటీని సాధించిన నేపధ్యంలో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీ.నాగేంద్రకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ముందు నుంచి సిద్దరామయ్యతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఐదు మందిలో తుకారాం కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొదారు. అయితే గతంలో తుకారాం మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తొలిసారిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని నాగేంద్ర కోరినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement