● కుటుంబాన్ని వెంటాడిన విషాదం
చందుర్తి: ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెండు నెలల క్రితం తండ్రి.. తాజాగా ఐదేళ్ల కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కమలాకర్ రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుమార్తె ఇషిక (5) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూనే చిన్నారి మృతి చెందడంతో తల్లి రిబికా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్తను కోల్పోయిన రెండు నెలలకే కుమార్తెను కోల్పోవడంతో తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


