ఆర్థిక సమస్యలతో మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో మహిళ ఆత్మహత్య

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

ఇల్లంతకుంట: ఆర్థిక ఇబ్బందులతో మండలంలోని కందికట్కూర్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన జంజిరాల కుమార్‌ కామారెడ్డిలో ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వెళ్లి పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ఎనిమిదేళ్ల క్రితం కుమార్‌ మరణించగా.. పద్మనే ఇద్దరి పిల్లలను పెంచి పోషిస్తోంది. ఏడాది క్రితం ఉపాధి కోసం పిల్లలను తీసుకొని హైదరాబాద్‌కు వెళ్లింది. కొడుకు చరణ్‌(16) ప్రైవేటు హోటల్లో పనిచేస్తోండగా కూతురు కళ్యాణి(14) ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఈక్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న యాసిడ్‌ తాగి పద్మ ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement