మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ఒక్కరోజు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నామని ఈవో అంజనారెడ్డి తెలి పారు. తిరిగి ఈనెల 25 నుంచి యథావిధి గా కొనసాగిస్తామన్నారు. కార్తీక పౌర్ణమితోపా టు గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వామివారి నిజరూప దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో ఆ ఒక్కరోజు ఆర్జిత సేవలు, అభిషేకాలు, వ్రతం, కుంకుమ పూజలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక దర్శనలు రూ.100, రూ.300, ధర్మదర్శనం యథా విధిగా ఉంటుందన్నారు. ఉదయం 7గంటల నుంచి 9 వరకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామని, భక్తులు సహకరించాలని కోరారు.
యూఏఈలో
ఉద్యోగ అవకాశాలు
జగిత్యాలటౌన్/విద్యానగర్(కరీంనగర్): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో భవన నిర్మాణ రంగ ఉద్యోగాల కోసం టామ్‌కాం ఆధ్వర్యంలో ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జగిత్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ, కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. యుఏఈలో నిర్మాణ రంగంలో గల షట్టరింగ్ కార్పెంటర్స్(వడ్రంగులు), స్టీల్ ఫిక్సర్స్, మేషన్స్, హెల్పర్స్ ఉద్యోగాల కోసం బుధవారం కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ పాస్‌పోర్ట్, వైట్ బ్యాగ్రౌండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కోరారు. 22 నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. నెలకు రూ.27,080 నుంచి రూ.34,830 మధ్య జీతం ఉంటుందన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హామీలు అమలు చేయాలి
కరీంనగర్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్, ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించే ప్రమా దం ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు విఘాతమన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని, యువత హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి యుగంధర్, నాయకులు కసిపోజుల సంతోష్ చారి, చంచల మురళి, చంచల రవి, కాల్వ శ్రీనివాస్, పినమల్ల ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాపర్ వైర్ చోరీ
ఇల్లంతకుంట: మండలంలోని సోమారంపేట, వెంకట్రావుపల్లి గ్రామాల పరిధిలో 11 వ్యవసాయ బోరుబావుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కాపర్ వైర్‌ను దొంగిలించారు. సోమవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు స్టార్టర్ నుంచి బోరు మోటార్ వరకు ఉన్న సుమారు 230 మీటర్ల వైరు కత్తిరించి ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచుతామని ఇల్లంతకుంట ఎస్సై హామీ ఇచ్చారని రైతు ఆనందరెడ్డి తెలిపారు.


