గోదాంలో చదువులు.. ఎన్నాళ్లీ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

గోదాంలో చదువులు.. ఎన్నాళ్లీ కష్టాలు!

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

నాలుగు బ్యాచ్‌లు.. రెండు క్లాస్‌రూంలు అందుబాటులోకి రాని నూతన కళాశాల భవనం కొనసాగుతున్న వైద్య విద్యార్థుల ఆందోళన సంఘీభావం తెలిపిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు సెక్రటేరియట్‌లో వైద్య కళాశాలపై మంత్రుల సమీక్ష

మెడికోల ఆందోళనల నేపథ్యలో వైద్య కళాశా ల, ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలపై సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన హైదరాబాద్‌లో ని సచివాలయంలో సమావేశం జరగనుంది. ఇందులో మంత్రి పొన్న ప్రభాకర్‌, కలెక్టర్‌ చిత్రామిశ్రా, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, కళాశాల భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు రవాణా, ఇతర సదుపాయాలపై సమగ్రంగా చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. 15 రోజుల్లోపు భవ నాలను అందుబాటులోకి తెస్తామన్నారు.

కళాశాలలో 400 మంది మెడికోలు.. మూడు మరుగుదొడ్లు

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ వైద్య కళాశాలలో నాలుగు బ్యాచ్‌లకు చెందిన 400 మంది మెడికోలకు కనీస వసతులు కరువయ్యాయి. 400 మందికి మూడు మరుగుదొడ్లు, రెండు తరగతి గదులే ఉండటం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. గోదాం తరహా భవనంలో వైద్య విద్యాబోధన, ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లు, అరకొర రవాణా సౌకర్యాలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్తపల్లిలో నూతన కళాశాల భవన నిర్మాణం 90శాతం పూర్తయినా అందుబాటులోకి రాకపోవడంతో భావి వైద్యుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధాన భవనం, హాస్టళ్ల నిర్మాణాల ను పూర్తి చేయడంతోపాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యుత్‌, రవాణా, ప్రయోగశాలల సౌకర్యాలు కల్పించాలని మెడికోలు రెండు రోజులుగా కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు.

వందలాది మందికి అరకొర సౌకర్యాలు

కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 250 మంది బాలికలు, 150 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. 100మంది సిబ్బందితో కలిపి మొత్తం 500 మందికి మూడు మరుగుదొడ్లే అందుబాటులో ఉన్నాయి. నాలుగు గదులు అవసరమైన చోట గోదాం తరహా భవనంలో రెండు గదుల్లో తరగతులు సాగుతున్నాయి. విద్యార్థులకు శాశ్వత వసతి గృహాలు అందుబాటులో లేకపోవడంతో విద్యానగర్‌, కోతిరాంపూర్‌, తీగలగుట్టపల్లిలోని ప్రైవేటు భవనాల్లో వసతి కల్పించారు. అక్కడి నుంచి కళాశాలకు వచ్చేందుకు రెండు బస్సులే అందుబాటులో ఉండటంతో రవాణా సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రత్యక్ష బోధనకు దూరంగా కొత్త బ్యాచ్‌

వైద్య విద్యలో ప్రత్యక్ష బోధన, ప్రయోగశాలల్లో శిక్షణ, ప్రాక్టికల్స్‌ కీలకం. వైద్య కళాశాలలో కొత్తగా చేరిన బ్యాచ్‌ విద్యార్థులకు ఇప్పటికీ ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగుతున్నాయి. నూతన భవన నిర్మాణం దాదాపు 90శాతం పూర్తయినా మిగిలిన పనుల్లో జాప్యం జరుగుతోంది. కళాశాల ప్రధాన భవనం, వసతి గృహాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.

కళాశాలలో ఆర్డీవో ఆరా

వైద్య కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పెండింగ్‌ సమస్యలను పరిశీలించేందుకు ఆర్డీవో షర్మిల ఆదివారం కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామన్నారు.

మెడికోల సమస్యలపై

నేడు మంత్రుల సమీక్ష

వైద్య కళాశాల, వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆందోళన చేస్తున్న మెడికోలకు ఆదివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంఘీభావం తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆందోళనలో కూర్చుంటారని చెప్పారు. తమ నిరసనకు రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవడం లేదని మెడికోలు స్పష్టం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆందోళనకు కేటీఆర్‌

సంఘీభావం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement