నగరం కాషాయమయం | - | Sakshi
Sakshi News home page

నగరం కాషాయమయం

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాక

లక్ష మందికి పైగా జనంతో మహా పాదయాత్ర

తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో సిటీలో సందడి

కరీంనగర్‌: కరీంనగర్‌ కాషాయమయమైంది. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పర్యటన సందర్భంగా మహా పాదయాత్రకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. లక్ష మందికి పైగా జనసమీకరణ లక్ష్యంగా భారీ ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కాషాయ తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లతో నిండిపోయాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

మధ్యాహ్నం పాదయాత్ర షురూ

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నితిన్‌ నబీన్‌ కరీంనగర్‌కు చేరుకోనున్నారు. కలెక్టరేట్‌ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో పాల్గొంటారు. వైశ్య భవన్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రాజీవ్‌ చౌక్‌, టవర్‌ సర్కిల్‌, గడియారం సెంటర్‌, శాసీ్త్ర రోడ్డు, భారత్‌ టాకీస్‌ మీదుగా కమాన్‌ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.

దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో కార్యక్రమాలు

‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం’.. అనే నినాదంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. కరీంనగర్‌లో జరిగే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement