సామూహిక సత్యనారాయణ వ్రతాలు
అంజనాద్రి ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్న అర్చకులు, హాజరైన భక్తులు
ఒక్కరోజు ఇంటి బయట నిద్రపోయేందుకు ఎంతో అసౌకర్యంగా భావిస్తాం. అలాంటి ఐదేళ్లుగా ఆ తండ్రీ కొడుకులకు బస్టాండే ఆవాసంగా మారింది. చలికి వణుకుతూ.. ఎండకు ఎండుతూ.. దోమల దాడిలో అల్లాడిపోతున్నారు. కొత్తపల్లి మండలం ఒద్యారం గ్రామానికి చెందిన కోనమేని అంజి భార్య చనిపోవడంతో పాటు గ్రామంలో ఎలాంటి ఉపాధి లేకపోవడంతో వృద్ధురాలైన అత్త, 8 ఏళ్ల కుమారుడితో నగరానికి వచ్చాడు. ఐదేళ్లుగా మాతా శిశు ఆస్పత్రి గేట్‌పక్కన బస్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల అంజి అత్త కూడా మృతిచెందింది. ఉపాధి లేదు.. కొడుక్కు తిండిపెట్టే పరిస్థితి లేదు. దాతలు ముందుకొస్తే కొడుకును ప్రభుత్వ హాస్టల్‌లో చదివిస్తానని వేడుకుంటున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
కరీంనగర్ కల్చరల్: నగరంలోని భగత్‌నగర్‌లో ఉన్న అంజనాద్రి క్షేత్రంలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం గారెపల్లి మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, రుద్రాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. పాల్గొన్న దంపతులకు తిరుమల లడ్డూ ప్రసాదం, కంకణాలు, మంత్రాక్షతలు, పార్థివ శివలింగాలను అందజేశారు. రేవతి బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.


