ముగిసిన టచ్‌ రగ్బీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన టచ్‌ రగ్బీ పోటీలు

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల మైదానంలో రెండురోజులుగా సాగిన రాష్ట్రస్థాయి రెండో టచ్‌ రగ్బీ క్రీడాపోటీలు ఆదివా రంతో ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 620 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. బాలుర విభాగంలో సబ్‌ జూనియర్స్‌లో ఆసిఫాబాద్‌ (ప్రథమ), నారాయణపేట (ద్వితీయ), జూనియర్‌ విభా గంలో వికారాబాద్‌ (ప్రథమ), ఆసిఫాబాద్‌, కామారెడ్డి (ద్వితీయ), సీనియర్‌ విభాగంలో మహబూబాబాద్‌ (ప్రథమ), రంగారెడ్డి (ద్వితీయ), కరీంనగర్‌ (తృతీయ) జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో సబ్‌ జూనియర్స్‌లో కరీంనగర్‌(ప్రథమ), సిరిసిల్ల (ద్వితీయ), పెద్దపల్లి (తృతీయ), జూనియర్స్‌లో కామారెడ్డి (ప్రథమ), కరీంనగర్‌ (ద్వితీయ), జగిత్యాల (తృతీయ), సీనియర్‌ విభాగంలో కరీంనగర్‌ (ప్రథమ), మహబూబాబాద్‌ (ద్వితీయ), సిరిసిల్ల (తృతీయ)స్థానాలు కై వసం చేసుకున్నాయి. రాణించినవారిని డిసెంబర్‌ 21,22,23 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో జరిగే జా తీయ పోటీలకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్‌ వంతడుపుల కస్తూరి, ఎంజేపీ ప్రిన్సిపాల్‌ శారద, టీజీపేటా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఏముల రవికుమార్‌, తెలంగాణ టచ్‌ రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్‌, ప్రవీణ్‌ కుమార్‌, కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు నిరంజన్‌, సంయుక్త కార్యదర్శి చిరుత కవిత, వంతడుపుల రఘు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిరుత శ్రీనివాస్‌, పీఈటీలు సాంబరాజు, అనిల్‌ కుమార్‌, సత్యానందం, రేణుక, రాజిరెడ్డి, నిరోష పాల్గొన్నారు.

సాధారణ ప్రసవంతో

సంపూర్ణ ఆరోగ్యం

కరీంనగర్‌: సహజ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, సిజేరియన్‌ శస్త్రచికిత్సలను నివారించాలని డీఎంహెచ్‌వో రాజగోపాల్‌ రావు సూచించారు. గర్భిణుల్లో సహజ ప్రసవంపై అవగాహన పెంచడంతోపాటు, ప్రసవ సమయంలో వారికి మానసిక ధైర్యం, భరోసా కల్పించడంలో మిడ్‌వైవ్స్‌ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నుంచి ఆదివారం సొసైటీ ఆఫ్‌ మిడ్‌వైవ్స్‌ ఇండియా (సోమీ) తెలంగాణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ‘వాక్‌ ఫర్‌ నేచురల్‌ బర్తింగ్‌’ ర్యాలీని డాక్టర్‌ రాజగోపాల్‌ రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు సాగిన ర్యాలీలో అధ్యాపకులు, విద్యార్థినులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సహజ ప్రసవ ప్రయోజనాలు, అనవసర వైద్య జోక్యాల నివారణపై కరపత్రాలు పంపిణీ చేశారు. సోమీ కోఆర్డినేటర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ లిల్లీ మేరీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉమా మహేశ్వరి, సోమీ టీమ్‌ సభ్యురాలు సుజాత పాల్గొన్నారు.

ప్రారంభమైన ఓపెన్‌ పీజీ తరగతులు

కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎమ్మెస్సీ బోటనీలో ప్రవేశాలు పొందిన వారికి జనవరి 10 వరకు ప్రతి ఆదివారం తరగతులు జరుగుతాయని వృక్షశాస్త్ర విభాగాధిపతి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మే రకు తరగతులను ప్రారంభించి మాట్లాడారు. వృక్షశాస్త్ర విభాగంపై మక్కువతో 42మంది రిజిస్టర్‌ అయ్యారని, వారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా చదివిన విద్యార్థులు ఎంతోమంది అత్యున్నతమైన పదవుల్లో రాణించారని గుర్తు చేశారు. సమన్వయ అధికారి మామిడిపల్లి సత్య ప్రకాశ్‌, వృక్షశాస్త్ర అధ్యాపకులు పడాల తిరుపతి, మహమ్మద్‌ తాహిర్‌ హుస్సేన్‌, అందె బుంగతిరుపతి, మహమ్మద్‌ తాజుద్దీన్‌, ఆసంపల్లి స్వరూపరాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement