● మూలవిరాట్టు చందనం తొలగింపు పూర్తి ● సంచుల్లో వేసి, సీల్ చేసి భద్రపరిచిన అధికారులు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి చందనోత్సవాల్లో భాగంగా మూలవిరాట్టుపై చందనం తొలగింపు ప్రక్రియ బుధవారం పూర్తయ్యింది. తొలగించిన చందనాన్ని దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో తూకం వేసి 99.720 కిలోలుగా నిర్ధారించారు. ఆ చందనాన్ని సంచుల్లో వేసి, సీల్ వేసి భద్రపరిచారు. కార్యక్రమంలో ఈవో అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, చిరంజీవ స్వామి, మారుతీ ప్రసాద్, స్థానాచార్యులు కపీందర్, ఏఈవో హరిహరనాథ్, పరిశీలకులు అశోక్, లక్ష్మారెడ్డి, ఏఎస్సై రామయ్య పాల్గొన్నారు.


