బోయినపల్లి: మండలంలోని కొదురుపాక చౌరస్తాలోని హోటల్లోకి బుధవారం ఓ కారు దూసుకెళ్లింది. వేములవాడ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు.. అతివేగంగా కొదురుపాక చౌరస్తాలో వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లగా.. వారు అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. దీంతో పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లి సిమెంట్ బెంచీలను ఢీకొని ఆగిపోయింది. స్థానికులు వారితో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తరలించారు. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. హోటల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


