ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని శీతాల చెరువు సమీపంలో 204 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించటానికి సిద్ధంగా ఉన్న సుల్తానాబాద్‌లోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన వేముల శ్రీనివాస్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎండు గంజాయిని స్థానిక యువకులకు విక్రయించటానికి శ్రీనివాస్ వచ్చినట్లు సమాచారం మేరకు వలపన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కరీంనగర్ రూరల్: ఆన్‌లైన్ వేదికగా రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాకు చెందిన వొడ్నాల జగన్ కూతురు వైష్ణవి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన వేల్పుల సాయికృష్ణ పరిచయమయ్యాడు. కరీంనగర్ పరిధిలో ఉన్న ఆరెపల్లిలోని సర్వే నంబరు 232/ఏ లోని 383.02 గజాల ఇంటి స్థలానికి రూ.కోటి 50లక్షల రుణం టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుంచి ఇప్పిస్తానని నమ్మించాడు. ముందుగా రూ.8.99 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని చెప్పడంతో వైష్ణవి సాయికృష్ణ అకౌంట్‌కు నగదు బదిలీచేసింది. లోన్ డాక్యుమెంట్, ప్రాసెసింగ్ పేరిట మరో రూ.3.22 లక్షలు వసూలు చేసిన సాయికృష్ణ రుణం మంజూరైనట్లుగా నకిలీ డాక్యుమెంట్‌ను జగన్‌కు పంపించాడు. రుణం కోసం సదరు సంస్థ ప్రతినిధులను జగన్ సంప్రదించగా నకిలీగా గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రస్తుతం కరీంనగర్‌లోని వావిలాలపల్లెలో నివాసముంటున్న సాయికృష్ణను బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ పత్రాలు, బ్యాంకు లావాదేవిల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
భీమన్న ఆలయంలో కార్తీకదీపాలు
వెలిగించి మొక్కుకుంటున్న మహిళలు
వేములవాడ: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వేములవాడ భీమన్న ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం భారీ సంఖ్యలో హాజరైన మహిళలు రంగురంగుల పూలతో వివిధ ఆకృతులను ఆవిష్కరించి, అందులో దీపాలను పెట్టి వెలిగించారు. ఆలయ అధికారులు మహిళలకు వాయినాలు అందించారు.
చెరువులో పడి వృద్ధురాలు మృతి
మెట్‌పల్లిరూరల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైర గంగనర్సు(75) బుధవారం మధ్యాహ్నం సమయంలో చెరువు వైపు వెళ్లింది. ఉన్నట్టుండి చెరువులో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న వారు మృతదేహన్ని బయటకు తీయించారు. గంగనర్సుకు కుమారుడు, కూతురు ఉన్నారు.
గంజాయి పట్టివేత
ఘరానా మోసగాడు అరెస్ట్