పోలీసులపై వాహనంతో హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై వాహనంతో హత్యాయత్నం

Nov 19 2026 12:13 AM | Updated on Nov 19 2026 12:13 AM

● ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి ● కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.. ముగ్గురు నిందితుల పట్టివేత ● ఇద్దరు బాలలను జువైనెల్‌ బోర్డు ముందు హాజరు

● ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి ● కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.. ముగ్గురు నిందితుల పట్టివేత ● ఇద్దరు బాలలను జువైనెల్‌ బోర్డు ముందు హాజరు

గంభీరావుపేట (సిరిసిల్ల): అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వాహనంతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున లింగన్నపేట వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు మహిపాల్‌, రమేష్‌ ఇసుక వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్‌ వారిపైకి వాహనాన్ని నడిపించాడు. ఈ ఘటనలో మహిపాల్‌ తప్పించుకోగా, రమేశ్‌ కుడిచేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జగదాంబతండా వద్ద ముగ్గురు నిందితులను పట్టుకొని వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో జువైనెల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరుపరిచారు. మరో నిందితుడు విజయ్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.

చేతబడి చేస్తున్నాడని దాడి

మానకొండూర్‌: తనకు చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మరో వ్యక్తిపై దాడిచేసిన ఘటన మానకొండూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. సీఐ శ్రీలత వివరాల ప్రకారం.. మానకొండూర్‌కు చెందిన దయ్యాల మల్లయ్య హోటల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గుల్ల లింగన్న చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అసభ్యపదజాలంతో దూషించి, రాయితో తలపై కొట్టి గాయపరిచాడు. బాధితుడి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement