జాగ్రత్తలతో నియంత్రణ సాధ్యం | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో నియంత్రణ సాధ్యం

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

జాగ్రత్తలతో నియంత్రణ సాధ్యం మందులు సొంతంగా ఆపొద్దు

మధుమేహం వచ్చిందని కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టాలి. వైద్యుల సూచన మేరకు హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌, కంటి చూపు, మూత్రపిండాలు, పాదాల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించాలి. మధుమేహాన్ని నిర్లక్ష్యంచేస్తే గుండె, మూత్రపిండాలు, కళ్లతో పాటు నరాలపైనా ప్రభావం పడుతుంది.

టైప్‌–2 మధుమేహం ఉన్న కొందరిలో బరువు తగ్గడం, ఆహార నియంత్రణ, వ్యాయామంతో చక్కెర స్థాయులు మెరుగుపడవచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందుల మోతాదును తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి దీర్ఘకాలం మందులు అవసరమవుతాయి. వైద్యుల సలహా లేకుండా మందులు ఆపడం లేదా మోతాదులు మార్చడం ప్రమాదకరం. మూలికా ఉత్పత్తులను కూడా వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. సరైన వైద్య చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే మధుమేహ నియంత్రణకు ఉత్తమ మార్గం.

– డాక్టర్‌ రాజగోపాల్‌రావు,

జిల్లా వైద్యాధికారి, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement