ఇండెంట్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

ఇండెంట్‌ దందా!

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

కోరుకున్న స్టేషన్‌లో పోస్టింగ్‌.. ఆపై వసూళ్లు!

ముందస్తుకు బదులు నెలనెలా ఇండెంట్లు

‘రాజకీయ’ సిఫార్సులతో అనుకున్నచోట పోస్టింగులు

ఖర్చుల భారం అధికారులపైనే!

ఇంటెలిజెన్స్‌ నిఘాకు చిక్కని వ్యవహారం?

పరోక్ష వసూళ్లపై పోలీసు వర్గాల్లో చర్చ

ముందు పోస్టింగ్‌.. ఆపై ఇండెంట్లు!

గతంలో కీలక పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌ కోసం స్టేషన్‌ ప్రాధాన్యతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముందస్తుగా చెల్లించేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల సిఫార్సులతో కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇప్పించి, ఆ తర్వాత వివిధ ఖర్చుల పేరుతో ఇండెంట్లు పంపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు, నాయకుల పర్యటనలు, ఫ్లెక్సీలు, పండుగల నిర్వహణ వంటి ఖర్చులను సంబంధిత సీఐలు, ఎస్సైలే భరిస్తున్నారనే చర్చ సాగుతోంది.

నెలనెలా ఖర్చుల భారం!

జిల్లాలోని ఓ సర్కిల్‌ పరిధిలో పోస్టింగ్‌ పొందిన అధికారికి రాజకీయ నాయకుడి కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీల ఖర్చు ఇండెంట్‌ పంపగా, పోస్టింగ్‌ ఇప్పించినందుకు కృతజ్ఞతగా ఆయన చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల ఖర్చుల పేరుతోనూ, ఇటీవల ఓ పండుగ సందర్భంగా మరో అధికారికి ఇండెంట్‌ పంపి చెల్లింపులు చేయించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా రెండేళ్ల పోస్టింగ్‌ కాలంలో ఎప్పటికప్పుడు కొత్త ఖర్చులు తెరపైకి వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో ఒకేసారి చెల్లించే మొత్తానికి బదులుగా ఇప్పుడు నెలనెలా ఆర్థిక భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పోలీసు శాఖలో పోస్టింగుల వ్యవహారం కొత్త రూపు సంతరించుకుంటోందా? అవుననే వాదన వినిపిస్తోంది. కోరుకున్న పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్‌ పొందేందుకు గతంలో ముందస్తుగా భారీ మొత్తంలో నగదు చెల్లించేవారనే ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం నేరుగా నగదు లావాదేవీలకు బదులుగా రాజకీయ నాయకుల కార్యక్రమాలు, పర్యటనలు, పండుగలు, ఇతర అవసరాల పేరుతో అధికారుల నుంచి విడతలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు వర్గాల్లో ఈ విధానాన్ని ‘ఇండెంట్‌ పోస్టింగులు’గా చర్చించుకుంటున్నారు. –కరీంనగర్‌ క్రైం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement