క్వింటాల్‌ పత్తి రూ.8,810 | - | Sakshi
Sakshi News home page

క్వింటాల్‌ పత్తి రూ.8,810

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఉద్యోగుల హక్కుల కోసం టీఎన్జీవోల పోరు ● డిసెంబర్‌ 12న భారీ ర్యాలీకి సన్నాహాలు ● ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: దారం శ్రీనివాస్‌రెడ్డి

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి గరిష్టంగా రూ.8,810 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 116 వాహనాల్లో 1,183 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.8,810, మోడల్‌ ధర రూ.8,750, కనిష్టంగా రూ.8,400 చొప్పున కొనుగోలు చేశారు. కాగా.. శని, ఆదివారాల్లో మార్కెట్‌కు సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా తెలిపారు.

వీసీ, రిజిస్ట్రార్‌పై విచారణ జరిపించాలి

కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలో వీసీ ఉమేశ్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ సతీశ్‌కుమార్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు నూనావత్‌ శ్రీనివాస్‌నాయక్‌తో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆవరణలో అక్రమంగా రెండెకరాల మేర మట్టి తవ్వకాలు జరిగాయని, ఎంతమేరకు తవ్వడానికి అనుమతులిచ్చారు.. ఎంత తవ్వారనే దానిపై అనుమతి పత్రాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ నిధుల ఆడిట్‌, యూనివర్సిటీ పాలక మండలి సమావేశాల నిర్వహణ, తీసుకున్న నిర్ణయాలు పరిశీలించాలని కోరారు.

కరీంనగర్‌ అర్బన్‌: ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధనే టీఎన్జీవోల సంఘం ప్రధాన లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 12న నిర్వహించనున్న భారీ ర్యాలీకి జిల్లా నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేశారు. సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకొని, నూతన వేతన సవరణను అమలు చేయాలని కోరారు. ఆసుపత్రులు ఉద్యోగుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయరాదని, ఎవరైనా అలా వసూలు చేస్తే ఆ వివరాలను సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణ్‌రావు, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్మీంధర్‌సింగ్‌, ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్‌ భరద్వాజ్‌, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు, నాయకులు ఇరుమల్ల శారద, రమేష్‌గౌడ్‌, ప్రసాద్‌రెడ్డి, సునీత, సరిత, తిమ్మాపూర్‌ అధ్యక్షుడు పోలు కిషన్‌, చొప్పదండి అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి నరేష్‌, జమ్మికుంట కార్యదర్శి సాయికుమార్‌, నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement