కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ గోదాంగడ్డ, సాయికృష్ణ ఫీడర్‌ల పరిధిలోని తాహెరామజీద్, శ్రీనగర్‌కాలనీ, అంజనాద్రి ఆలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్‌ఎఫ్ క్వార్టర్లు, జెడ్పీ క్వార్టుర్లు, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్, బీఎస్‌ఎఫ్ క్వార్టర్ల వెనక భాగం, గోదాం వెనకభాగం, రఘుపతిరెడ్డి ఆసుపత్రి, ముకరంపుర, గీతాభవన్, మున్సిపల్ కార్యాలయం, చర్చి గల్లీ, పోలీస్ హెడ్ క్వార్టర్లు, పరేడ్ మైదానం, సాయికృష్ణ థియేటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
రేకుర్తి, కొత్తపల్లిలో..
33/11కేవీ రేకుర్తి, కొత్తపల్లి సబ్ స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, వెలిచాల, వెదిర, దేశ్‌రాజ్‌పల్లి, రాణిపూర్, వైద్య కళాశాల, రేకుర్తి, గౌడ్స్‌కాలనీ, విజయపురికాలనీ, కంటి ఆసుపత్రి, సాలెహ్‌నగర్, సమ్మక్క గద్దెలు, సూర్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.


