ఉత్సాహంగా మహిళల టీ20 క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మహిళల టీ20 క్రికెట్‌ టోర్నీ

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

● లోటస్‌ జీ, మేరిగోల్డ్స్‌ హెచ్‌ జట్ల ఘన విజయం ● అక్షిత గౌడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వేములవాడ: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ గురువారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు.. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన బానోత్‌ సురేష్‌, జగిత్యాల జిల్లాకు చెందిన రాంపెల్లి మహేందర్‌ ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. గురువారం వేములవాడలోని పెద్దమ్మజంక్షన్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై ప్రేమానందం తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 160 గ్రాముల గంజాయి, హోండా డియో స్కూటీ, రెండు వివో మొబైల్‌ ఫోన్లు, రూ.400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి వేములవాడ, కరీంనగర్‌, సిద్దిపేట, భువనగిరి, కాజీపేట ప్రాంతాల్లో పలు వైన్‌షాపులలో దొంగతనాలకు పాల్పడ్డట్లు విచారణలో ఒప్పుకున్నారు. కరీంనగర్‌లోని విఘ్నేశ్వర వైన్స్‌లో దొంగతనానికి సంబంధించిన 72 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్సై ప్రేమానందం, పోలీస్‌ సిబ్బంది ఇమ్రాన్‌, నరేందర్‌లను సీఐ అభినందించారు.

● లోటస్‌ జీ, మేరిగోల్డ్స్‌ హెచ్‌ జట్ల ఘన విజయం ● అక్షిత గౌడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌లోని వీజేఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ మహిళా ఎమర్జింగ్‌ స్టార్స్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రోజెస్‌ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లోటస్‌ జీ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రోజెస్‌ ఏ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు చేయగా, లోటస్‌ జీ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 45 పరుగులు చేసిన బిష్పికకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేడీసీఏ అధ్యక్షుడు ఆగం రావు, కార్యదర్శి మనోహర్‌రావు, ఉపాధ్యక్షులు మహేందర్‌ గౌడ్‌, మురళీధర్‌రావు విజేతలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో కేడీసీఏ బాధ్యులు శ్రవణ్‌, హరికృష్ణ గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి విక్రేతల అరెస్టు

డైట్‌లో తాత్కాలిక బోధన పోస్టులు

తిమ్మాపూర్‌: ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌) కరీంనగర్‌లో ఖాళీగా ఉన్న కళాశాస్త్రం, వ్యాయామ విద్య బోధనా పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మొండయ్య తెలిపారు. కళాశాస్త్రానికి బీఏ, ఎంఏ ఫైన్‌ ఆర్ట్స్‌, వ్యాయామ విద్యకు ఎంపీఈడీ అర్హత ఉండాలన్నారు. 65 ఏళ్లు దాటని రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఎల్‌ఎండీ కాలనీలోని డైట్‌కు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ నవంబర్‌ 16 అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement