మూఢనమ్మకాలకు చెక్‌ముకి ● విద్యార్థుల్లో సైన్స్ ప్రేరేపణకు విశేష కృషి ● రేపటి నుంచి చెక్‌ముకి సంబురాలు ● ఈ నెల 28న జిల్లా స్థాయి పోటీలు ‘ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, దేశం కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్, పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్’ అనే నినాదాలతో అంధాకారంలో తచ్చాడుతున్న మానవుడిని వెలుగులోకి తీసుకు వచ్చే ఏకై క వాహనం సైన్స్.. అని నమ్ముతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పలువురు మేధావులు, అభ్యుదయవాదులు 1988, ఫిబ్రవరి 28న జన విజ్ఞాణ వేదికను ఏర్పాటు చేశారు. విద్యార్థి చెకుముకి పేరుతో 1990 డిసెంబర్ నుంచి సైన్స్ అంశాలతో మాసపత్రికను నిర్వహిస్తూ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్‌లు సైతం చేపట్టేది. వ్యాపారమయమైన టాలెంట్ టెస్ట్‌ల సంస్కృతిని వ్యతిరేకిస్తూ 2010 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోంది. జేవీవీకి ప్రభుత్వం తరఫున విద్యాశాఖ అధికారులు సహకారం అందిస్తున్నారు.
పాఠశాల స్థాయి పరీక్ష ఈనెల 12న జరగనుంది. (రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సుమారు 7,500లకు పైగా పాఠశాలల నుంచి 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు). మండలస్థాయి పరీక్షలు 21న జరగనున్నాయి. (సుమారు 550మండలాల్లో 36 వేలమంది విద్యార్థులు పాల్గొంటారు). జిల్లాస్థాయి పరీక్షలు 28న నిర్వహించనున్నారు.(రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 12 వేలమంది విద్యార్థులు పాల్గొంటారు). ప్రతీ జిల్లా నుంచి నాలుగు టీముల చొప్పున 132 టీములు రాష్ట్రస్థాయి సైన్స్ సంబురాల్లో పాల్గొంటాయి. రాష్ట్రస్థాయి సంబురాలను డిసెంబర్ 11,12,13వ తేదీల్లో నిర్వహించనుండగా, 132 టీముల నుంచి 396 మంది ఎంపిక చేయబడిన విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరవుతారు.
మూడురోజులు జరిగే రాష్ట్ర స్థాయి సంబురాల్లో విద్యార్థులకు రాత పరీక్ష, ఆక్టివిటి రౌండ్, క్విజ్, విజువల్ రౌండ్, క్రియేటివ్ రౌండ్, సైన్స్ ప్రయోగాలపై పోటీలు నిర్వహిస్తారు. సైన్స్ సెమినార్లు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఆకాశ దర్శనం, తదితర కార్యక్రమాలు ఉంటాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు జూన్ నుంచి అక్టోబర్ ఆఖరు వరకు సైన్స్, సోషల్, గణితం పాఠ్యాంశాలను చదువుకోవడంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనించాల్సి ఉంటుంది. మండల, జిల్లా స్థాయి పోటీల్లో రాత పరీక్ష, క్విజ్ ఉంటాయి.
● విద్యార్థుల్లో సైన్స్ ప్రేరేపణకు విశేష కృషి ● రేపటి నుంచి చెక్‌ముకి సంబురాలు ● ఈ నెల 28న జిల్లా స్థాయి పోటీలు
బోయినపల్లి: విద్యార్థుల్లో శాసీ్త్రయ వైఖరులను పెంపొందించడానికి చెకుముకి పోటీలు తోడ్పడనున్నాయి. ప్రపంచానికి సైన్స్ మూలాధారం అన్న మాటలను అక్షరాల ఆచరిస్తున్నది జన విజ్ఞాణ వేదిక. శ్రీలోకంలో జరుగుతున్న అనేక దురాచారాలు, అక్రమాలు, మూఢనమ్మకాలను చూస్తూ సమాజం పాడైపోతోంది అని నిట్టూరుస్తూ ఉండడం ప్రస్తుత రోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ప్రతీ పరిణామం వెనుక ఓ కారణం ఉందంటూ కార్యాచరణ సంబంధమనే సైన్స్ సూత్రాన్ని ప్రజల ముందు ఉంచుతూ తమదైన శైలిలో సైన్స్ ప్రచారం చేస్తున్న సంస్థ జన విజ్ఞాణ వేదిక. ఈ నెల 12 నుంచి చెక్‌ముకి సైన్స్ సంబరాల సందర్భంగా కథనం.
చెకుముకి మొదలు ఇలా..
సంబరాల్లో లక్షలాది మంది విద్యార్థులు
రాష్ట్ర పోటీల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు