అదుపుతప్పి కారు బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి కారు బోల్తా

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

అదుపుతప్పి కారు బోల్తా ● తప్పిన పెనుప్రమాదం జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కారులో జగిత్యాలకు వస్తుండగా మోరపల్లి వద్ద అదుపుతప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కోరెంలో చోరీ మహారాష్ట్ర కార్మికుడి ఆత్మహత్య

● తప్పిన పెనుప్రమాదం

బోయినపల్లి: మండలంలోని కోరెం గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు.. వెంకటరమణ ఈ నెల 8న రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దొంగలు ఇంటి పైభాగం నుంచి లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు 12 గ్రాముల బంగారు చైన్‌, 5.5 గ్రాముల బంగారు ఉంగరం, 3.6 గ్రాముల బంగారు చైన్‌ ఎత్తుకెళ్లి నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలాన్ని రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వేములవాడ: వేములవాడ పట్టణం జాతరగ్రౌండ్‌లో అద్దె గదిలో మహారాష్ట్రకు చెందిన సుతారీ కార్మికుడు సంతోష్‌ (30) మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలయ విస్తరణ పనుల్లో సుతారీగా పనిచేస్తున్న సంతోష్‌ మృతిని గమనించిన అతడి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్‌ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement