అడ్డేమిటో..!? | - | Sakshi
Sakshi News home page

అడ్డేమిటో..!?

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

అసలేం జరుగుతుందో? ● హాట్‌టాపిక్‌గా డంప్‌యార్డ్‌ టెండర్‌ ● కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరికతో చర్చనీయాంశం ● కొనసాగుతున్న బయోమైనింగ్‌ టెండర్‌ ప్రక్రియ ● ఈఎన్‌సీ ఆమోదం అనంతరం ప్రైస్‌బిడ్‌ ఓపెన్‌

టెండర్‌పైనే గంపెడాశలు

డంప్‌యార్డ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు తాము టెండర్‌ పిలిస్తే, లేనిపోని వివాదాలు సృష్టించి కాంట్రాక్టర్‌ రాకుండా చేస్తున్నారంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్‌ వేదికగా రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. రూ.17 కోట్లతో 2 లక్షల 64 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు ఓ వైపు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుంటే, అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నారంటూ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా అడ్డుకొంటున్నదెవరో చెప్పాలని, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియలో ఏదో జరుగుతుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందుకే టెండర్‌ ప్రక్రియ కొలిక్కి రావడం లేదనే ప్రచారమూ ఉంది.

టెండర్‌లో పొందుపరిచిన

బయోమైనింగ్‌ ప్రతిపాదిత

డంప్‌యార్డ్‌ చిత్రం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : నగరంలో డంప్‌యార్డ్‌ సమస్య ఎంత కలకలం సృష్టిస్తుందో.. బయోమైనింగ్‌ టెండర్‌ ప్రక్రియ అంతేస్థాయిలో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త గుట్టలను కాస్త తగ్గించేందుకు చేపట్టిన బయోమైనింగ్‌ టెండర్‌ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండడం తెలిసిందే. టెండర్‌ను అడ్డుకొనేందుకు కుట్రపన్నుతున్నారంటూ సాక్షాత్తు కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్ని లేపుతున్నాయి. బయోమైనింగ్‌ టెండర్‌తో కనీసం సగం చెత్త గుట్టతగ్గుతుందని బాధితులు ఆశిస్తున్న తరుణంలో, ఈ సరికొత్త వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనే చర్చ తీవ్రమవుతోంది.

కొనసాగుతున్న ప్రక్రియ

డంప్‌యార్డ్‌లో ప్రస్తుతం 4.46లక్షల మెట్రిక్‌టన్నుల చెత్త నిల్వ ఉంది. అదనంగా 150 నుంచి 200 మెట్రిక్‌టన్నుల చెత్త ప్రతిరోజు డంప్‌యార్డ్‌లో చేరుతోంది. డంప్‌యార్డ్‌లో చెత్త గుట్టలు పెరిగి, మంటలు చెలరేగి, పొగ సగం నగరాన్ని వ్యాపించి, ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిధులు రూ.17 కోట్లతో 2.64 లక్షల మెట్రిక్‌టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు నగరపాలకసంస్థ టెండర్‌ పిలిచింది. గత నెల 7వ తేదీన టెండర్‌ పిలవగా, 26వ తేదీన ముగిసింది. 26వ తేదీ సాయంత్రం 4 గంటల తరువాత టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేయగా, నాలుగు కంపెనీలు బిడ్స్‌ దాఖలు చేశాయి. ఈ నాలుగు కంపెనీల్లో ఏవి నిబంధనలకు లోబడి ఉన్నాయో గుర్తించి ఆమోదించాల్సి ఉంటుంది. ఈఎన్‌సీ ఆమోదం పొందిన తరువాత ప్రైస్‌బిడ్‌ను ఓపెన్‌ చేయనున్నారు. టెండర్‌ రూ.10 కోట్లు దాటి ఉండడంతో టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌చేసిన తరువాత ఈఎన్‌సీ ఆమోదానికి పంపించారు. ఈఎన్‌సీకి పంపించి వారం రోజులు దాటగా, ప్రస్తుతం ఆమోదం రావాల్సి ఉంది. ఈఎన్‌సీ ఆమోదం పొందిన ఏజెన్సీల ప్రైస్‌బిడ్‌ ఓపెన్‌ తరువాత టెండర్‌ ఖరారుకానుంది.

డంప్‌యార్డ్‌ ఎత్తివేయాలంటూ ఏళ్లకాలంగా శివారు ప్రాంతవాసులు ఆందోళన చేస్తున్నారు. డంప్‌యార్డ్‌ను తరలించే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం, ఫలానా చోటికి తరలిస్తారనే ప్రచారం జరిగినా ఆ ప్రాంతవాసులు ముందుగానే ఆందోళన చేస్తుండడం తెలి సిందే. దీంతో డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేయడమే సమస్యకు ఏకై క పరిష్కారంగా కనిపిస్తోంది. సగం చెత్తను తొలగించేందుకు టెండర్‌ పిలవగా, మొత్తం చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు టెండర్‌ పిలిస్తే బాగుండేదనే భావన ప్రజల్లో ఉంది. టెండర్‌తో సగం చెత్త అయినా తొలగిపోతుందనుకుంటుంటే వివాదాస్పదంగా మారడంతో ఉసూరుమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement