ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి ● బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ ఆదా యాన్ని పెంచేందుకు రెవెన్యూ విభాగం ఆస్తి పన్ను ల వసూళ్లపై ప్రత్యేకదృష్టి సారించాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం ఆస్తి పన్నులు వసూళ్లు చేయాలన్నారు. బకాయిదారులకు ముందస్తు నోటీసులు జారీ చేయాలని, గడువులోగా చెల్లించకుంటే ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను కూడా వసూలు చేయాలన్నారు. నగరపాలక సంస్థకు చెందిన దుకాణాల అద్దెలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భువన్‌ సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. అసెస్మెంట్‌ వారీగా సంబంధిత యజమానికి ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఇంజనీరింగ్‌ విభాగంపై సమీక్ష నిర్వహించారు. వివిధ గ్రాంట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వాటి పురోగతి, ఇంకుడుగుంతలు,స్మార్ట్‌ సిటీ చివరి దశలో పనులు, పూర్తయిన పనులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులు ప్రారంభించని, నత్తనడకన సాగే కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, ఈఈ లచ్చిరెడ్డి, డీఈలు వెంకటేశ్వర్లు, ఓం ప్రకాశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఓటు నమోదుకు మరో అవకాశం

డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్టులో పేరు రానివాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ మరో అవకాశం కల్పించిందని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. అలాంటి వారుంటే ఓటు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కమిషనర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరైనా డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్టులో నమోదు కాకుండా ఉంటే భూత్‌ లెవల్‌ అధికారిని, ఏఈఆర్వో కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలతో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement