పల్లెల్లో పనుల జాతర | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పనుల జాతర

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

పల్లెల్లో పనుల జాతర వేతన వెసులుబాటు నిరుద్యోగ భృతి అమలయ్యేనా..? కేరళ ఆదర్శం

సంఖ్య కూలీలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో

వీబీజీ రామ్‌జీ అండ

నిత్యం 12వేలకు పైగా కూలీలు ఉపాధి బాట

గ్రామాలు సరే..

విలీన గ్రామాల పరిస్థితేమిటి?

వీబీజీ రామ్‌జీ పథకం(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం) కూలీలకు చక్కని ఉపాధి వేదికగా నిలుస్తోంది. ఎల్‌నినో కారణంగా గ్రామాల్లో పనుల్లేక ఉపాధి పనులను ఆశ్రయిస్తున్నారు. ఏ కాలంలోనైనా పనులు కల్పించడం దీని ప్రత్యేకత కాగా.. జాతరలా పనులకు తరలుతున్నారు. జిల్లాలో ప్రతిరోజు 2,973 పనులు జరుగుతుండగా.. 12,676 మంది ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. గత నవంబర్‌లో వేయి మంది మాత్రమే పనులకు వెళ్లగా.. ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో పదింతలకు పైగా కూలీలు పనులను ఆశ్రయిస్తున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: విలీన గ్రామాల్లో ఉపాధి పనుల్లేక పనులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. మున్సిపాలిటీల్లో కలిసి తమ గ్రామం హోదా పెరిగిందని సంతోషించాలో.. పనుల్లేక పస్తులుండటంపై రోదించాలో తెలియని అయోమయ స్థితి. జిల్లాల పునర్విభజన, మున్సిపాలిటీల అప్‌గ్రేడేషన్‌తో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. జిల్లాలో చాలా గ్రామాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో చేరాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 18 గ్రామాలకు పైగా విలీనం చేశారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో 20కి పైగా గ్రామాలను కలిపారు. ప్రస్తుతం సదరు గ్రామాలు గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి మున్సిపాలిటీలో వార్డులుగా మారగా.. ఉపాధిహామీ పథకం దూరమైంది. ఆయా గ్రామాల్లో సుమారు 7వేల మందికి పైగా ఉపాధి కూలీలుండగా.. ఉపాధి పనుల్లేక ఇతర ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని ప్రజాప్రతినిధులు వినతులు సమర్పిస్తున్నా ఆచరణలో అమలు కావడం లేదు.

ఉపాధి కూలీలకు కూలి నేరుగా ఖాతాలకే చెల్లింపులు జరుగుతున్నాయి. గ్రామం యూనిటీగా పనులు జరుగుతున్నాయి. కూలీల గ్రూపుల వ్యవస్థ ఉండదు. ఇదివరకు సోమవారం పనులు ప్రారంభమై శనివారం లేదా గురువారం ప్రారంభమై బుధవారం పనులు ముగిసేలా పద్ధతి ఉండేది. ప్రస్తుతం ఏరోజు పనికి ఆరోజు డిమాండు బట్టి పని కల్పించే వెసులుబాటు ఉంది. ఇందుకు కూలీలు చేయగలిగే 100 రోజులు సరిపడా పనుల గుర్తింపు చేసి గ్రామసభ తీర్మానంతో పనులు ఆమోదించనున్నారు.

పని కోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో ఉపాధి కల్పించకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలనేది నిబంధన. మస్టర్‌ పూర్తయిన వెంటనే 5 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా.. సదరు విధానం ఆచరణలో అమలవడం లేదని కూలీలు చెబుతున్నారు. ఒకవేళ నమోదు చేయకుంటే ఆలస్య రుసుమును విధించాలి. మరి ఈ వేసవిలోనైనా నిరుద్యోగ భృతి లభిస్తుందా చూడాలి. కాగా ఉపాధిహామీ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాలకు వర్తించదని, దానిపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే పనులు చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధి పనులు జరిగేచోట సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

కేరళలో 2010 నుంచి పట్టణ ఉపాధిహామీ పథకాన్ని చేపట్టి నిరుపేదలకు ఏటా 100 రోజుల పని కల్పిస్తోంది. ఈవిధంగా అందుబాటులోకి వచ్చే ఉపాధి అవకాశాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. పట్టణాల్లో నైపుణ్యం అవసరం లేని కూలీ పనులను ఈ పథకం కింద కల్పిస్తున్నారు. చెట్ల పెంపకం, తోట పనులతో పర్యావరణ సంరక్షణకు ఈ పథకం తోడ్పడుతోంది. పట్టణ రహదారుల పక్కన, పాఠశాల మైదానాల్లో పండ్ల మొక్కలను నాటారు. రోడ్ల పక్కన గడ్డి, కలుపు మొక్కలు తొలగించడం, వరద నీటి కాల్వలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్‌ చెత్తను ఏరేయడం వంటి పనులను పట్టణ ఉపాధిహామీ కింద చేపడుతున్నారు. వర్షాకాలంలో రోడ్డుపై వరద, మురుగు పొంగిపొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మండలం పనుల హాజరవుతున్న

చిగురుమామిడి 149 671

చొప్పదండి 230 769

ఇల్లందకుంట 89 743

గంగాధర 265 1,512

గన్నేరువరం 143 742

హుజూరాబాద్‌ 120 579

జమ్మికుంట 184 854

కరీంనగర్‌ రూరల్‌ 338 644

శంకరపట్నం 168 943

కొత్తపల్లి 143 339

మానకొండూర్‌ 248 1,244

రామడుగు 329 1,006

సైదాపూర్‌ 185 874

తిమ్మాపూర్‌ 219 903

వీణవంక 163 853

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement