వివాదాస్పదం.. డీడబ్ల్యూవో తీరు! | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పదం.. డీడబ్ల్యూవో తీరు!

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

డిప్యుటేషన్‌ ముగిసినా

పదవీలోనే అధికారి

రూ.2 కోట్ల బిల్లులకు క్లెయిమ్‌

బిల్లులు నిలిపేసిన ఎస్టీవో

రెండు నెలలుగా నిలిచిన

సిబ్బంది వేతనాలు

బిల్లుల అంశాన్ని పరిశీలిస్తాం: కలెక్టర్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

జగిత్యాలకు చెందిన చిన్నారి రుద్ర మానేశ్‌ కథ సుఖాంతమైంది. పిల్లాడి దత్తత వ్యవహారంలో డీడబ్ల్యూవో భాస్కర్‌ వ్యవహరించిన తీరుపై శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో స్పందించిన అధికారులు డాక్యూమెంట్లు పరిశీలించి తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు దత్తతను అధికారికంగా పూర్తిచేశారు. ఇది ఇలాఉంటే డీడబ్ల్యూవో భాస్కర్‌ డిప్యూటేషన్‌ మీద ఉన్నారు. డిప్యూటేషన్‌ ముగిసి కూడా నెలరోజులు దాటుతోంది. అయినా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి రూ.2 కోట్ల బిల్లులు క్లెయిమ్‌ చేశారు. ఈ బిల్లులు ఆమోదించే ముందు ట్రెజరీ విభాగం అప్రమత్తమైంది. డీడబ్ల్యూవో డిప్యూటేషన్‌ ముగిసిన విషయాన్ని గుర్తించి బిల్లులను తిప్పిపంపింది. దీంతో సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు కూడా నిలిచిపోయాయి. ఈ విషయంపై జిల్లా ఎస్టీవో పద్మను వివరణ కోరగా.. భాస్కర్‌ డిప్యూటేషన్‌ కొనసాగింపుపై అధికారిక ఆదేశాలు లేని కారణంగా బిల్లులు తిప్పి పంపామని, సిబ్బందికి వేతనాలు నిలిచిన మాట వాస్తవమేనని వెల్లడించారు. ఇదే విషయమై డీడబ్ల్యూవో భాస్కర్‌ను వివరణ కోరగా.. తానెలాంటి బిల్లులు క్లెయిమ్‌ చేయలేదని విషయాన్ని దాటవేయడం గమనార్హం.

డీడబ్ల్యూవో బిల్లుల విషయం

దృష్టికి రాలేదు

డీడబ్ల్యూవో భాస్కర్‌ బిల్లులు క్లెయిమ్‌ చేసిన విషయం ఇంతవరకూ దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నేనే పరిశీలిస్తాను అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సాక్షికి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement