రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ టీచర్ల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ టీచర్ల ప్రతిభ

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

మెట్‌పల్లిరూరల్‌/కొడిమ్యాల: మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆల్‌రౌండర్‌ బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ మ్యూజిక్‌, డాన్స్‌ అండ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. ఈ నెల 28న ప్రారంభమైన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఫోక్‌ గ్రూప్‌ డాన్స్‌, ఫోక్‌ సోలో సాంగ్‌, ఫోక్‌ గ్రూప్‌ సాంగ్‌, అయ్యా బాబోయ్‌ ఏఐ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజయలక్ష్మి ఆల్‌రౌండర్‌ బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా గుర్తింపు సాధించింది. ఈ మేరకు కల్చర్‌ సెక్రటరీ యామిని కనకధార, కల్చరల్‌ వింగ్‌ మేనేజర్‌ శ్రీశైలం ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే కొడిమ్యాల మండలం ఆరపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రావణి క్లాసికల్‌ సోలో డ్యాన్స్‌, తదితర విభాగాల్లో సత్తాచాటి ప్రశంసాపత్రం అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement