ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య (ఎస్జీఎఫ్‌) ఆధ్వర్యంలో కరీంనగర్‌ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో దాదాపు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ఎల్‌. బన్సీలాల్‌ మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. బాలబాలికలకు రన్స్‌, జంప్స్‌, త్రోస్‌, వాకింగ్‌ విభాగాలలో పోటీలు నిర్వహించి విజేతలకు పతకాలు అందజేశారు. కన్వీనర్‌ పోతన శ్రీనివాస్‌, పీడీలు డాక్టర్‌ ఎజాజ్‌ అహ్మద్‌, చంద్రశేఖర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement