బహ్రెయిన్‌లో వలసజీవి మృతి | - | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌లో వలసజీవి మృతి

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

సిరిసిల్ల అర్బన్‌: గంపెడాశలతో గల్ఫ్‌బాట పట్టిన వ్యక్తి అనారోగ్య ంతో మృతిచెందాడు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేట జ్యోతినగర్‌కు చెందిన అల్లెపు మల్లయ్య(55) పది నెలల క్రితం బహ్రెయిన్‌ వెళ్లాడు. విధులు ముగించుకొని గదికొచ్చిన తర్వాత జ్వరం, తలనొప్పి కోసం ట్యాబ్లెట్‌ వేసుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్వగ్రామంలో ఉన్న తన భార్య దేవవ్వకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు బహ్రెయిన్‌లో ఉన్న తన స్నేహితులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. కూతుళ్ల వివాహాల కోసం రూ.17లక్షల వరకు లోన్‌ తీసుకున్నాడని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని భార్య దేవవ్వ, కుటుంబ సభ్యులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement