విదేశాల్లోని నిందితులపై లుక్‌ అవుట్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

విదేశాల్లోని నిందితులపై లుక్‌ అవుట్‌ నోటీస్‌

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

జగిత్యాలక్రైం: నేరాలు చేసి ఇతర దేశాలకు పారిపోయిన నిందితులతో కోర్టుల్లో కేసులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటి పరిష్కారం కోసం విదేశాల్లో ఉన్న నిందితులపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక నిఘా పెట్టి లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌ (ఎల్‌వోసీఎస్‌) జారీ చేశారు. నిందితులు స్వదేశానికి వస్తున్న సమయంలో ఇమిగ్రేషన్‌ వారి సహాయంతో అరెస్ట్‌ చేసి జైలుకు తరలిస్తున్నారు.

152 మందిపై లుక్‌ అవుట్‌ నోటీసులు

జగిత్యాల జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు నేరం చేసి ఇతర దేశాలకు పారిపోయిన 152 మందిపై లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌ జారీ చేయగా, 119 మందిని అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మందిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయగా, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 16 మందిని అరెస్ట్‌ చేశారు.

సత్వర కేసుల పరిష్కారానికి వారెంట్లు

జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలికంగా కోర్టుల్లో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయశాఖ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో పలు కేసుల్లో నిందితులుగా ఉండి కోర్టుకు హాజరు కాక తప్పించుకుని తిరుగుతున్న వారందరికీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి పోలీసులకు జాబితా అందజేస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకుని కేసుల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.

ఇమిగ్రేషన్‌ సెంటర్లలో నిందితుల జాబితా

జిల్లాలో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునేందుకు పోలీసులు వారి పూర్తి వివరాలు సేకరించి హైదరాబాద్‌, ముంబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోని విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్‌ సెంటర్లకు సమాచారం అందజేస్తారు. నిందితులు స్వదేశానికి చేరుకోగానే ఇమిగ్రేషన్‌ సెంటర్‌ వద్ద గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తారు. దీంతో నిందితులను పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తారు. దీని వల్ల పెండింగ్‌ కేసులను పరిష్కరించే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

స్వదేశం రాగానే అరెస్ట్‌కు సిద్ధం

నేరం చేసి విదేశాలకు వెళ్లిన 152 మంది

ఇమిగ్రేషన్‌ సాయంతో గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement