కరీంనగర్ క్రైం: బాలలపై లైంగిక నేరాలను అరికట్టి, వారి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. గురువారం రాంనగర్, ఆరెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు సదస్సులు నిర్వహించారు. న్యాయమూర్తులు బానోతు రాజేశ్వర్, చిరాగ్ మెహతా పాల్గొని పోక్సోచట్టం–2012, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నుంచి రక్షణ గురించి వివరించారు. అవసరమైనప్పుడు చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సాయానికి 112ను సంప్రదించాలని కోరారు.
తాగునీరు, విద్యుత్ పొదుపే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో రాను న్న రోజుల్లో నీటి లభ్యత, విద్యుత్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో ముందు జాగ్రత్త అత్యవసరమని కలెక్టర్ చిత్రామిశ్రా స్పష్టం చేశారు. వీబీజీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై గురువారం రాత్రి కలెక్టరేట్‌లో సమీక్షించారు. జలసిరి పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల రీచార్జికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా ప్రచారం చేయాలన్నారు. జీవాలకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హాస్టళ్లు, సా మూహిక అపార్ట్‌మెంట్లతో పాటు నీటి నిల్వకు అనువైన వివిధ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్‌డీవో గీత, డీపీవో జగదీశ్వర్, పీఆర్ ఈఈ జనార్దన్ పాల్గొన్నారు.
పంట మార్పిడికి ప్రణాళిక
వీణవంక: ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి తప్పనిసరని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి, ఘన్ముక్కు ల గ్రామాల్లోని అయిల్‌పామ్, కూరగాయాల పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆర్డీవో జలకుమారి, అయిల్ ఫెడరేషన్ డీఎం రోహిత్, ఏడీఏ సునీత ఉన్నారు.
బియ్యం ఽకృత్రిమ కొరత సృష్టిస్తే వదలం
కరీంనగర్ అర్బన్: ఎల్‌నినోను బూచిగా చూపి వినియోగదారులను మోసగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని జిల్లా పౌరసరఫరాల అధి కారి గట్టు నర్సింగరావు హెచ్చరించారు. గురువారం రైస్ డిపోల హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో కలెక్టరేట్‌లో సమావేశఽం నిర్వహించారు. మార్కెట్లో వివిధ రకాల బియ్యం లభ్యత, నిల్వల వివరాలు, ధరలను సమీక్షించారు. మార్కె ట్లో బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వలు చేసినా, అధిక ధరలకు విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. వ్యాపార ప్రాంగణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, బియ్యం రకం, బియ్యం నిల్వల పరిమాణం, కిలోకు ఽఎంత ధరో స్పష్టంగా పేర్కొనాలని, ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంగళారపు రజనీకాంత్, సివిల్ సప్లయ్ డీటీ సురేందర్, సందీప్ పాల్గొన్నారు.
పత్తి మార్కెట్‌కు సెలవు
జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్‌కు తుపాన్ కారణంగా శుక్రవారం, శని,ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శి మల్లేశం తెలిపారు. మార్కెట్‌కు గురువారం 88వాహనాల్లో 687క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. గరిష్ట ధర రూ.9,040, మోడల్ ధర రూ.8,850, కనిష్ట ధర రూ.8,400కు వ్యాపారులు కొనుగోలు చేశారు.


