దేశసేవే స్వయం సేవకుల ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

దేశసేవే స్వయం సేవకుల ధ్యేయం

Oct 22 2026 12:39 AM | Updated on Oct 22 2026 12:39 AM

దేశసేవే స్వయం సేవకుల ధ్యేయం ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దీక్షాభూమి సందర్శన

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌: భారతమాత సేవ కోసం జీవితాలను అంకితం చేసే వారే స్వయం సేవకులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. దేశ రక్షణ, సమాజ సేవ కోసం స్వయం సేవకులు నిరంతరం పనిచేస్తారని పేర్కొన్నారు. సంఘ్‌ బలం సంఖ్యాబలం కాదని, క్రమశిక్షణ అని అన్నారు. ద్వేషం కాకుండా సేవా సంకల్పమే సంఘ్‌ ఆయుధమని తెలిపారు. దేశంలో అసహనం తొలగిపోయి శాంతి, సుస్థిరత నెలకొనాలని, ప్రజలంతా సమైక్యతతో అభివృద్ధి దిశగా సాగాలని ఆకాంక్షించారు. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే శక్తులకు తావివ్వకుండా భారతీయులమనే భావనతో ప్రజలంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. భారతమాత వైభవమే ఆర్‌ఎస్‌ఎస్‌ విజయమని, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపడమే స్వయం సేవకుల లక్ష్యమని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

కరీంనగర్‌టౌన్‌: 70వ ధమ్మచక్ర ప్రవర్తన్‌ దివస్‌ సందర్భంగా బౌద్ధ సొసైటీ ఆఫ్‌ ఇండియా కరీంనగర్‌ అధ్యక్షుడు పటాకుల భూమయ్య ఆధ్వర్యంలో ప్రతినిధులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ దీక్షాభూమిని సందర్శించి నివాళి అర్పించారు. ఈ బృందంలో అన్నెమల్ల సురేశ్‌, జెల్ల గోవర్ధన్‌, బొంత రాజయ్య, రోండి అరుణ్‌, మద్దెల రాజయ్య, వెన్న రాజమల్లయ్య, అడెపు సంతోష్‌, సిగిరి గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించిన చారిత్రక స్థలాన్ని సందర్శించి, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. అంబేద్కర్‌ చూపిన బౌద్ధ ధమ్మ మార్గం, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, బౌద్ధ ధమ్మ సందేశం ప్రచారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement