రామగుండం హైస్కూల్‌కు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

రామగుండం హైస్కూల్‌కు మహర్దశ

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా గుర్తించిన ప్రభుత్వం

మారనున్న సర్కార్‌ ఉన్నత పాఠశాల స్వరూపం

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా పరభుత్వం గుర్తించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. రెండు రోజుల క్రితం స్కూల్‌ సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీంతోపాటు హైదరాబాద్‌లో టీపీఎస్‌గా ఎంపిక చేసిన సిబ్బందితో సమావేశం నిర్వహించింది. ఇప్పటికే సదుపాయాల కల్పన, అభివృద్ధికి రూ.4.33 కోట్లు కేటాయించింది.

టీపీఎస్‌ స్కూల్‌ మార్గదర్శకాలు

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో క్రీడామైదాన స్థలం ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో గరిష్టంగా 1,500 మంది విద్యార్థులు ఉండే విధంగా సమీపంలోని రెండు, మూడు ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తారు. బోధన ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌/అల్పాహారం అందిస్తారు. డిజిటల్‌ తరగతి గదులు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు, ఆధునిక గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు, ప్రీ–ప్రైమరీ వారికోసం ప్లే జోన్‌లు నిర్మిస్తారు.

మూడు విభాగాల్లో బోధన

టీపీఎస్‌లో మూడు విభాగాలుగా విద్యాబోధన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. తొలిదశలో నర్సరీ– రెండోతరగతి, రెండో దశలో మూడు నుంచి ఎనిమిదో తరగతి, మూడో దశలో తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. వీటన్నింటికీ ప్రిన్సిపాల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

– జింక మల్లేశం, ఎంఈవో, రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement