ఉత్సాహం నింపింది | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహం నింపింది

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

చికిత విజయం మా లాంటి క్రీడాకారుల్లో కొత్త ఆశలు, ఉత్సాహం నింపాయి. సౌత్‌ కొరియాను షూట్‌–ఆఫ్‌లో ఓడించవచ్చని నిరూపించింది. చికిత అక్క, ఆసియా గేమ్స్‌లో డబుల్‌గోల్డ్‌ కొట్టడం ఇన్సిపిరేషన్‌. గ్రామీణులు కూడా ఒలింపిక్‌ స్థాయి క్రీడాకారులవుతారని ఈ విజయంతో తేలిపోయింది.

– జి.శ్రీమయిరెడ్డి, జాతీయ విలువిద్య క్రీడాకారిణి

సువర్ణ అధ్యాయం

ఆసియా క్రీడల్లో చికిత, సాహిల్‌ సాధించిన విజయం భారత విలువిద్య చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఒకేరోజు డబుల్‌గోల్డ్‌ సాధించడమే కాకుండా, మహిళల విభాగంలో ప్రపంచరికార్డును సమం చేయడం చికిత అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

– నందెల్లి మహిపాల్‌,

ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు

చికితకు అభినందనలు

సాధారణ రైతుబిడ్డ ఆసియా ఖండంలోనే అత్యుత్తమ జట్టు దక్షిణ కొరియాను మట్టికరిపించి స్వర్ణబాణం ఎక్కుపెట్టడం గర్వకారణం. ఆమె సాధించిన డబుల్‌ గోల్డ్‌ విజయం వేలాది మంది యువ క్రీడాకారులకు సరికొత్త ఊపునిస్తుంది. చికితకు అభినందనలు.

– గట్టు అనిల్‌కుమార్‌గౌడ్‌,

అంతర్జాతీయ రోలార్‌ స్కేటర్‌, పెద్దపల్లి

అద్భుతం

ఒలింపిక్స్‌లో 2028 లాస్‌ ఏంజెలెల్స్‌ క్రీడల నుంచి కాంపౌండ్‌ ఆర్చరీలో తొలిసారి చికిత ప్రవేశించడం అభినందనీయం. ఒలింపిక్స్‌ చరిత్రలో చికిత ఓ మైలురాయి. ఆసియా గేమ్స్‌తోనే భారత్‌ అర్హత సాధించడం ఒక మైలురాయిగా నిలిచింది.

– ఎం.రవీందర్‌,

వాలీబాల్‌ సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement