అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అభినందనీయం

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

మన ఆడబిడ్డ తానిపర్తి చికిత జపాన్‌ వేదికపై అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం మనకు గర్వకారణం. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించింది. – చింతకుంట విజయరమణారావు,

ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే

అందరికీ స్ఫూర్తి

ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డులతో భారత్‌కు గర్వకారణంగా నిలిచిన చికితకు అభినందనలు. గ్రామాల నుంచి ఒలింపిక్‌ స్థాయికి ఎదిగిన చికిత ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆమె స్పూర్తితో ఎందరో మెరికల్లాంటి క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. – గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి,

ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఒలింపిక్‌ సంఘం

యువ క్రీడాకారులకు ఆదర్శం

ప్రపంచ చాంపియన్‌ దక్షిణ కొరియాపై చి కిత్స చూపిన సంయమనం అద్భుతం. మ హిళల టీమ్‌ విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేయడం అంత సులువు కాదు. పట్టుదలతో గ్రామీణ ప్రాంత మట్టి నుంచి ఒలింపిక్‌ స్థాయికి ఎదిగిన చికిత ప్రయాణం అనేకమంది యువ అథ్లెట్లకు ఆదర్శం. – కొమురోజు శ్రీనివాస్‌,

ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం

వ్యక్తిగత ఈవెంట్‌లోనూ పతకం ఖాయం

మా అక్క అంతర్జాతీయ వేదికపై సాధించిన ఘనత మా కుటుంబానికే కాకుండా ప్రతీగ్రామీణ క్రీడాకారుకు ప్రేరణ. చిన్నప్పుడు పొలంలో వరి కోతలు అయ్యాక మిగిలిన గడ్డివాములను టార్గెట్‌గా పెట్టుకుని మేమిద్దరం ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. వ్యక్తిగత ఈవెంట్‌లో కూడా పతకం సాధిస్తుంది. – తానిపర్తి యశ్వంత్‌రావు,

చికిత సోదరుడు, జాతీయ విలువిద్య క్రీడాకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement