ఉమ్మడి జిల్లాస్థాయి టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాస్థాయి టెన్నిస్‌ పోటీలు

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

మంథని: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా పోటీలు పెద్దపల్లి జిల్లా మంథని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టులో బుధవారం ప్రారంభించారు. అండర్‌ 14,17 బాలబాలికల పోటీలను మంథని మున్సిపల్‌ చైర్మన్‌ ఓడ్నాల శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సుమారు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో నిర్మించిన సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడాకారులకు అల్పాహారం అందించారు. మంథని జోన్‌ సెక్రటరీ, పెద్దపల్లి జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ కనకొండ లక్ష్మణ్‌, ఆర్గనైజర్‌ కొమురోజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12న హైదరాబాద్‌లో జరిగేరాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్యం

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ ఆరెపల్లి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని ఎన్‌.సరిత హైదరాబాద్‌లో అష్మిత కేలో ఇండియా ఉమెన్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించింది. బుధవారం ప్రధానోపాధ్యాయుడు సంగోజు శ్రీనివాస్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ జయరామ్‌, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

డ్రైనేజీ సమీపంలో శిశువు మృతదేహం లభ్యం

మానకొండూర్‌(శంకరపట్నం): కేశవపట్నం పా తవాడ కరీంపేటకు వెళ్లే మార్గంలోని డ్రైనేజీ స మీపంలో బండరాళ్ల వద్ద గుంతలో గుడ్డలతో చు ట్టిన పసికందును పూడ్చిన సంఘటన గ్రామస్తులను కలవరపెట్టింది. గ్రామంలోని వీధి కుక్కలు గుడ్డలను లాగడంతో బుధవారం శిశువు మృతదేహం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వైద్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆడ శిశువుగా గుర్తించారు. విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement