కరీంనగర్‌క్రైం: కరీంనగర్ టౌన్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని రాజన్న జోన్–3 డీఐజీ, సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం సీపీ గౌస్ ఆలంతో కలిసి సందర్శించారు. కార్యాలయంలో వి విధ విభాగాలను పరిశీలించారు. అ నంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల ని యంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సున్నితమైన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రామచందర్‌రావు, తిరుమల్, పుల్లయ్య, డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


