‘ఆశీర్వాద దీపం’.. రక్తదాన శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

‘ఆశీర్వాద దీపం’.. రక్తదాన శిబిరాలు

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

● మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రేపటి నుంచి సేవా కార్యక్రమాలు ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌: గుజరాత్‌ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకు ని ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌–జన్‌ సేవా హీ ప్రభు సేవా’ పేరిట దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో మాట్లాడారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రజలు దీపాలు వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ప్రార్థించాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. అదే రోజు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరా లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ‘సేవ–అంకితభావం–25 ఏళ్లు’, ‘వికసిత భారత్‌’ అంశాలపై చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 25 నుంచి వచ్చేనె ల 7 వరకు ‘అంగన్‌ మిలన్‌ సేవ’లో భాగంగా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను సన్మానిస్తామన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు డ్రామా ఆర్టిస్టుల్లా మా రాయని బండి సంజయ్‌ విమర్శించారు. అవినీతి అనే నాణేనికి ఆ రెండు పార్టీలు బొమ్మా బొరుసులాంటివని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలంతా శుద్ధపూసలా? ఒక్క అవినీతి కూడా చేయలేదా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ అవినీతిపై బీఆర్‌ఎస్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన సాగించలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కేంద్రం ఆదుకోవాలని కోరుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలోనూ భూములు అమ్ముకుని ప్రభుత్వం నడిపే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ తరహా పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

విమోచన దినోత్సవం ఘనంగా..

ఈ నెల 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని సంజయ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవాలు నిర్వహించడంతో పాటు తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని ప్రకటించారు. మేయర్‌ కొలగాని శ్రీనివా స్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement