‘డబుల్‌’ నిరసన | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ నిరసన

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

మండలంలోని గుండ్లపల్లి స్టేజీ నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని బీజేపీ నాయకులు మంగళవారం గన్నేరువరం రోడ్డులో గుంతలోని నీటిలో కాగితపు పడవలతో నిరసన తెలిపారు. డబుల్‌ రోడ్డు నిర్మాణం కోసం గుండ్లపల్లిస్టేజీ వద్ద ధర్నా చేసి 30 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రా నందున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి సిద్ధమని హెచ్చరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్‌, బీజేవైఎం అధ్యక్షుడు మచ్చ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. – గన్నేరువరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement