మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లి | - | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లి

Sep 12 2026 12:06 AM | Updated on Sep 12 2026 12:06 AM

● ఏరడపల్లిలో మాయలేడీ వీరంగం

● ఏరడపల్లిలో మాయలేడీ వీరంగం

శంకరపట్నం: మంచినీళ్లు అడిగి ఓ మాయలేడీ మహిళ మెడలోంచి బంగారం దోచుకెళ్లింది. ఈ ఘటన శంకరపట్నం మండలం ఏరడపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కలకుంట్ల కమలాకర్‌రావు వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఇంట్లో అతని భార్య సరోజన ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు గుర్తు తెలియని మహిళ వచ్చింది. తనకు ఏమైనా సాయం చేయాలని కోరింది. మంచి నీళ్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించింది. ఒంటరిగా ఉందని గ్రహించి సరోజన మెడపై కత్తిపెట్టి బెదిరించింది. మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుంది. సరోజనను ఇంట్లో బంధించి పారిపోయింది. సరోజన కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచారు. కమలాకర్‌రావు ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్‌, ఎస్సై శేఖర్‌రెడ్డి పరిశీలించారు. గ్రామంలో సీసీఫుటేజీలు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement