ఘనంగా శ్రావణ పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రావణ పూజలు

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

వేములవాడ: భీమేశ్వరఆలయంలో బుధవారం శ్రావణమాస పూజలు వైభవంగా నిర్వహించారు. రాజన్న ఆలయంలో ఏకాంతంగా విశేష పూజలు చేయగా, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసమంతా జరిగిన నిత్య రుద్రాభిషేక పూజా ఫలాలను సమర్పిస్తూ 11 మంది రుత్వి కులతో 121 రుద్రాలతో విశేష రుద్రహవనం నిర్వహించారు. ఈవో రమాదేవి, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, నరేందర్‌ తదితరులు హాజరయ్యారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

ఆలయంలో ఈవో తనిఖీలు

భీమేశ్వరస్వామి ఆలయంలో ఈవో రమాదేవి తనిఖీలు చేపట్టారు. సౌకర్యాలపై భక్తులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏఈవో నాగుల మహేశ్‌, పర్యవేక్షకులు నరేందర్‌, భాస్కర్‌, శివసాయి, రాజేందర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు శ్రీనివాస్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement