కరీంనగర్ అర్బన్: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాళోజీ తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారని, ప్రజా అవసరాల కోసం నిరంతరం కృషి చేశారని పలువురు కొనియాడారు.


