పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళిక

Sep 9 2026 11:40 PM | Updated on Sep 9 2026 11:40 PM

● కలెక్టర్‌ చిత్రామిశ్రా

● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నామని కలెక్టర్‌ చిత్రామిశ్రా తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టూరిజం అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లాలోని మానేరు జలాశయం, ఇల్లందకుంట ఆలయం, ఎలగందుల కోట, బొమ్మలమ్మగుట్ట, నగునూరు పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, సిబ్బంది, సైన్‌ బోర్డులు, ఫుడ్‌కోర్టులు, రహదారి ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సర్వాయిపేటలో సర్దార్‌ సర్వాయి పాపన్న గుట్ట, మానేరు రివర్‌ ఫ్రంట్‌ టూరిజం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ రూట్‌మ్యాప్‌ తయారు చేస్తామని, తద్వారా విద్యార్థులు, సందర్శకులకు పర్యటన సులభతరం అవుతుందన్నారు. చేతివృత్తులు, చేనేత, హస్తకళలను గుర్తిస్తామని, వారి వస్తువులు విక్రయించుకునేలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఏఈఈ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement