కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సీపీ గౌస్ ఆలం తనిఖీ చేశారు. స్టేష న్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వివరాలను పరిశీలించారు. సీసీటీఎన్‌ఎస్, ఈ సాక్ష్య, సమన్వయ వంటి సాంకేతిక పోర్టల్స్, అప్లికేషన్ల పనితీరును సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు. సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.
యూనివర్సిటీ జిమ్ ప్రారంభం
కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన జిమ్‌ను సీపీ గౌస్‌ఆలం ప్రారంభించారు. జిమ్‌లోని వ్యాయామ పరికరాలను పరిశీలించారు. వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ పి. సతీశ్‌కుమార్, ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేష్ కుమార్ పాల్గొన్నారు.


