కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్పాట్లు చేశామని తెలంగాణ యోగా సంఘం చైర్మన్ రవీందర్ సింగ్ తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం మాట్లాడుతూ.. కొత్తపల్లిలోని అ ల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. బాలికలకు భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో, బాలురకు వివేకానంద సీబీఎస్‌ఈ పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అల్ఫోర్స్ అధినేత వి.నరేందర్‌రెడ్డి, వివేకానంద కరస్పాండెంట్ సుధాకర్‌రావు హాజరవుతారన్నారు.


