న్యూస్‌రీల్
మనసారా.. మానసాదేవి
గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేట శ్రీ మానసాదేవి అమ్మవారి దర్శనానికి శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో ఆలయానికి చేరుకున్నారు. సుమారు 4వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. సాయంత్రం 108 నైవేద్యాలతో మహా నివేదన నిర్వహించారు. వివిధ
రంగులతో కూడిన గాజులతో ఆలంకరణ చేశారు. ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.


