నిరసన.. నివేదన | - | Sakshi
Sakshi News home page

నిరసన.. నివేదన

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

కరీంనగర్‌ టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజు ల అరాచక, వైఫల్య పాలన చేస్తోందని బీఆర్‌ఎస్‌ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు చివరిరోజు కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించి, వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ప్రజాపాలన అటకెక్కిందన్నారు. కేటీఆర్‌ పిలుపుమేరకు చేపట్టిన ఆందోళనల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దురుసుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement