లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాటం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాటం చేయాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌.. ముగిసిన మహాసభలు

● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌.. ముగిసిన మహాసభలు

కరీంనగర్‌ టౌన్‌: లేబర్‌ కోడ్‌ల రద్దుకు ఉద్యమాలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో జరుగుతున్న ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ఘనంగా ముగిశాయి. యూసుఫ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని చూస్తోందన్నారు. మూడేళ్లలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలు నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ నివేదిక ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కలవేన శంకర్‌, పంజాల శ్రీనివాస్‌, టేకుమల్ల సమ్మయ్య, ప్రేమ్‌పావని, వాసిరెడ్డి సీతా రామయ్య, ఏఐటీయూసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement