● లక్షకుపైగా నగదు అపహరణ
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన ఎన్నం సత్యనారాయణ కిరాణా దుకాణంలో దొంగలు రూ. లక్ష ఎత్తుకెళ్లారు. ఆదివారం ఆయన తల్లి చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. ఇల్లు తాళం వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని దుండగులు అదేరోజు రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. షాప్ కౌంటర్‌తో పాటు ఇంట్లో ఉన్న దాదాపు లక్ష రూపాయలకుపైగా నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన సత్యనారాయణ భార్య గాయత్రి ఈ దృశ్యం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.


